సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తోన్న హాలీవుడ్ ఒలీవియా

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన నటిస్తోన్న ఆలియా భట్‌ను ఇంటికి పంపించి వేసినట్టు సమాచారం.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమాలో ఆలియా భట్ షూటింగ్ నిన్నటితో పూర్తి కావడంతో ఆలియా భట్. సరాసరి ముంబాయి ఫ్లైట్ ఎక్కినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తోన్న హాలీవుడ్ ఒలీవియా మోరిస్ పై సన్నివేశాలు మాత్రమే మిగిలి వున్నాయి. దాంతో పాటు క్లైమాక్స్ మాత్రమే మిగిలి ఉందని టాక్. ఈ క్లైమాక్స్‌ను ఫిబ్రవరి వల్ల షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ముందుగా అనుకున్న 2020 జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు రాజమౌళి అండ్ టీమ్.