సమాజాన్ని సమైక్యంగా ఉంచడమే పండుగల లక్ష్యం కావాలని బాలగంగాధర్ తిలక్ పిలుపునందుకుని రాష్ట్రం లోనే కాదు, మన వరంగల్ జిల్లాలో పలు చోట్ల హిందూ పండుగలను చేయటం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వినాయక చవితి విగ్రహాలు ఊరు వడ వెలిస్తున్నాయి, వీటిలో ప్రధాన పాత్ర అంటా యువతరానిదే. ఈ క్రమంలోనే అనేక రూపాలు, అనేకానేక సొగసుల మేళవింపులతో వినాయక రూపాలు మనకి దర్శనమిస్తుంటాయి. వరంగల్ జిల్లా కాజిపేట్ బాపూజీనగర్ కి చెందిన హమారా హిందూస్తాన్ గణేష్ ఉత్సవ కమిటీ వరంగల్ లో జరుగుతున్నా అకృత్యాలు, చిన్నారి శ్రీహిత ఘటన యువతను కన్నీరు పెట్టించింది, మల్లి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అని ఆ వినాయకుడిని ఆరాధిస్తున్నారు.

మరలా జరిగితే ఆ దేవుడే ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుంది అని కాజిపేటలో హమారా హిందూస్తాన్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం ఆడపిల్లలని రక్షించు అనే concept తో మట్టి వినాయక ప్రతిమ సృష్టించి ఆశ్చయపరిచారు. ఈ నిర్మాణ ప్రక్రియ చూపారులని ఆకట్టుకుంటంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ వినాయక విగ్రహ తయారీ విశేషాలని తెలుసుకునేందుకు హమారా వరంగల్ అక్కడి నిర్వాహకుల్ని సంప్రదించింది.

కాజిపేట్ యువజనుల హమారా హిందూస్తాన్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షలు నార్లగిరి వినయ్ తో పాటు ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతీయేటాలనే ఈ సరి కూడా విభిన్నంగా చేయాలన్న ఆలోచల ప్రతిరూపమే ఈ ఉగ్ర గణేశుని విగ్రహం అన్నారు. 9 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు…