SI దూషించాడని యువతి ఆత్మహత్యాయత్నం

తన బంధువు కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తనను థర్డ్‌ ఎస్‌ఐ అకారణంగా అసభ్య పదజాలంతో దూషించి అవమానించాడని ఓ యువతి పోలీస్‌స్టేషన్‌ నుంచి పరుగెత్తికెళ్లి రైల్వేట్రాక్‌ పై నిలబడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి న సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ వద్ద శనివారం ఉద్రిక్తత సృ ష్టించింది. జనగామలోని మహంకాళి స్ర్టీట్‌కు చెందిన పి.సౌజన్య శనివారం స్టేషన్‌కు వచ్చి థర్డ్‌ ఎస్‌ఐ జి.విద్యాసాగర్‌తో వాగ్వాదానికి పాల్పడింది.

కొద్దిసేపటికే ఎస్‌ఐ తనను అసభ్యకరంగా దూషించాడని ఏడుస్తూ చనిపోతానని అక్కడే ఉన్న పోలీసులకు చెప్పి రైల్వేస్టేషన్‌ వైపు పరుగెత్తుకెళ్లింది.
అప్రమత్తమైన సెకండ్‌ ఎస్‌ఐ జి.పరమేశ్వర్‌ రైల్వేట్రాక్‌పై నిలబడి వున్న యువతిని పట్టుకొని డీసీపీ కార్యాలయానికి చేర్చారు. ఈసందర్భంగా సదరు యువతి ఎస్‌ఐపై డీసీపీకి ఫిర్యాదు చేసింది. తన భావ నరే్‌షను పోలీసులు ఓ కేసు విషయంలో స్టేషన్‌కు పిలిపించగా తాను వెంట వెళ్లానని, తాను గతంలో ఇచ్చిన ఫిర్యాదుసైతం స్టేషన్‌లో పెండింగ్‌లో ఉండగా డీసీపీకి ఫిర్యా దు చేశానన్నారు. తనపై కోపంగా ఉన్న ఎస్‌ఐ విద్యాసాగర్‌ జనం ముందు అసభ్యకరంగా దూషించి అవమానించాడన్నారు.

ఈ విషయమై ఎస్‌ఐ విద్యాసాగర్‌ను వివరణ కోరగా తాను యువతిని అసభ్యకరంగా దూషించలేదని, యువతి పాత కేసు విషయంలో వాగ్వాదానికి పాల్పడగా నచ్చచెప్పి పంపించడం జరిగిందని తెలిపారు.