మాజీ డిప్యూటీ సీఎం , స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఏ పనిచేసినా కూడ సంచలనాలకు కేంద్రంగా మారుతారు. పదో తరగతి విద్యార్ధినితో ఎమ్మెల్యే రాజయ్య గోరుముద్దలు తిన్నాడు . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . జనగామ జిల్లా స్టేషన్ పూర్ నియోజకవర్గంలోని చిలుపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం మూడు రోజుల క్రితం జరిగింది . ప్రభుత్వ పాఠశాలలో ప్రదానోపాధ్యాయుడి ఉద్యోగ విరమణ సభ పూర్తైన తర్వాత బోజన విరామ సమయంలో ఎమ్మెల్యే రాజయ్య తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పదో తరగతి విద్యార్ధిని అన్నం తినిపిస్తే ఎమ్మెల్యే రాజయ్య అన్నం తిన్నాడు. ప్రధానోపాధ్యాయుడి అభినందన సభలో టెన్ విద్యార్ధిని బాగా ప్రసగించిందని ఎమ్మెల్యే రాజయ్య ప్రశంసలతో ముంచెత్తారు . ఆ విద్యార్ధినిని తనకు అన్నం తినిపించాలని ఎమ్మెల్యే రాజయ్య కోరినట్టుగా ప్రచారం సాగుతోంది . కానీ , ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే రాజయ్య మాత్రం ఖండిస్తున్నారు .

అంకుల్ మీకు నేనే భోజనం తినిపిస్తానని ఆ విద్యార్దినే కోరిందని. విద్యార్ధిని కోరికను తాను కాదనలేకపోయినట్టుగా ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్యకు విద్యార్ధిని అన్నం తినిపించే సమయంలో కొదంరు ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఆ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఎప్పుడు ఏం చేసినా సంచలనమే , వివాదాస్పదమే. ఏదో కార్యక్రమం చేసినా కూడ రాజయ్య వార్తల్లో వ్యక్తిగా మారుతున్నాడు. మూడు రోజుల క్రితం స్కూల్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది..