UPI పేమెంట్స్ కేవలం డెబిట్ కార్డులకు మాత్రమే లింక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈ రోజు RBI గవర్నర్ నూతన మార్గదర్శకాలను ప్రవేశ పెట్టారు. ఈ నూతన మార్గదర్శకాల ఆధారంగా క్రెడిట్ కార్డులను కూడా UPI పేమెంట్స్‌కు లింక్ చేసుకునేందుకు అనమతి ఇచ్చింది. ఇది స్వదేశీ “రూపే క్రెడిట్” కార్డులతో అమలు ప్రారంభమవుతుందని RBI గవర్నర్ తెలిపారు. ఇంతకు ముందు వీసా, మాస్టర్ కార్డ్ వంటి ఇతర కార్డు నెట్ వర్క్‌లు మాత్రమే UPI పేమెంట్స్‌కు అవకాశం ఉంది.